తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోంలో సీట్ల లెక్కలు తేల్చిన ఎన్​డీఏ!

అసోంలో ఎన్నికల కౌంట్​డౌన్​ మొదలైన క్రమంలో సీట్ల సర్దుబాటుపై కసరత్తు ముమ్మరం చేసింది భాజపా. రాష్ట్రంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో.. 86 స్థానాల్లో పోటీపై భాజపా, అసోం గణపరిషత్​, యూనైటెడ్ పీపుల్స్​ పార్టీ లిబరల్​ మధ్య ఒప్పందం కుదిరింది. ఈనెల 27న మొదటి విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో తమ అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని అసోం భాజపా అధ్యక్షుడు రంజిత్ దాస్ తెలిపారు.

Assam Assembly polls: BJP, allies finalise sharing of 86 out of 126 seats
అసోంలో 86 స్థానాల్లో పోటీపై భాజపా కూటమి ఒప్పందం

By

Published : Mar 5, 2021, 11:25 AM IST

అసోంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ భాజపా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో 86 స్థానాల్లో పోటీపై భాజపా, అసోం గణపరిషత్​, యూనైటెడ్​ పీపుల్స్ పార్టీ లిబరల్ మధ్య ఒప్పందం కుదిరినట్లు ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రంజిత్ దాస్ వెల్లడించారు. అయితే కూటమిలో అంతర్గత కారణాల వల్ల ఏ పార్టీకి ఎన్ని సీట్లని వెల్లడించటం లేదన్నారు.

మార్చి 27న మొదటి విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో తమ అభ్యర్థుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇంకో 12 స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత రాలేదని.. అందుకు ఇంకాస్త సమయం పడుతుందన్నారు. ఈ ఎన్నికల్లోనూ ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​నే సీఎం అభ్యర్థిగా అన్న ప్రశ్నకు దాస్​ స్పందించారు. సొంత ప్రభుత్వం ఉన్నచోట.. సీఎం అభ్యర్థిని తాము ప్రకటించమన్నారు.

అసోంలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ మార్చి 9న ముగియనుంది. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మార్చి 12, మూడో విడత మార్చి 19న ముగియనుంది.

బోడో పీపుల్స్​ ఫ్రంట్(బీపీఎఫ్).. 2016 ఎన్నికల్లో భాజపా కూటమిలో ఉంది. ఆ ఎన్నికల్లో బీపీఎఫ్ 12 సీట్లు సాధించింది. అయితే ఈ సారి భాజపా కూటమి వీడి కాంగ్రెస్​ జట్టు కట్టింది బీపీఎఫ్.

ఇదీ చదవండి :అసోం మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదల

ఇదీ చదవండి :బంగాల్​లో 20, అసోంలో 6 భారీ ర్యాలీలకు మోదీ!

ఇదీ చదవండి :భాజపాతో కటీఫ్‌.. బీపీఎఫ్‌ ప్రకటన

ABOUT THE AUTHOR

...view details