తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​, అసోంలో భాజపా ప్రచారకర్తలు వీరే - అసోం​లో భాజపా ప్రచార తారలు

బంగాల్​, అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచార ప్రధాన ప్రచారకర్తల పేర్లను భాజపా ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోనూ 40 మంది నేతలు ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు. వీరికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు.

sam and west bengal Assembly elections
బంగాల్​, అసోంలో భాజపా ప్రచార తారలు వీరే

By

Published : Mar 10, 2021, 12:46 PM IST

బంగాల్​, అసోంలో మొదటి దశ ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని భాజపా వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా.. రెండు రాష్ట్రాల్లోనూ 40 మందితో కూడిన ప్రధాన ప్రచారకర్తల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. వీరికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు.

అసోంలో స్టార్ క్యాంపైనర్లు​..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్​ గడ్కరీ, నరేంద్ర సింగ్​ తోమర్​, స్మృతి ఇరానీ యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్​, మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​, మణిపుర్​ సీఎం బీరేన్​ సింగ్​ సహా పలువురు నేతలు అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారకర్తలుగా వ్యవహరించి, ఓటర్లను ఆకర్షించనున్నారు.

అసోంలో భాజపా ప్రచార తారల పేర్లు

బంగాల్​లో..

బంగాల్​లో ఎన్నికల్లో ప్రచారకర్తలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్​, అమిత్​ మాలవీయా సహా ఇటీవల భాజపాలో చేరిన బాలీవుడ్​ నటుడు మిథున్​ చక్రవర్తి, పాయల్​ సర్కార్​ తదితరులు వ్యవహరించనున్నారు.

బంగాల్​ లో భాజపా ప్రచార తారల పేర్లు

ఇదీ చూడండి:అసోం తొలిదశ ఎన్నికలకు 173 మంది నామినేషన్​

ABOUT THE AUTHOR

...view details