భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి, తమిళనాడులోని రామేశ్వరంలోని 'న్యూ పంబన్ బ్రిడ్జి' ని (New Pamban Bridge) 2022 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొత్త పంబన్ బ్రిడ్జి నిర్మాణపనుల చిత్రాలను ట్విట్టర్లో షేర్ చేశారు.
మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి (Pamban Bridge) ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi News) పునాదిరాయి వేయగా.. ఈ బ్రిడ్జి నిర్మాణపనులు 2019 నవంబరు 9న ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి సుమారు రూ.250కోట్లు వెచ్చింది. 104ఏళ్ల చరిత్ర గల ఈ బ్రిడ్జి.. బంగాళాఖాతంలోని పంబన్ దీవికి, దేశానికి అనుసంధానంగా ఉంటుంది. 63మీట్లరు పొడవుగా ఉండి పడవలు, ఓడలు వెళ్లే సమయంలో పైకి లిఫ్ట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు.