కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు అరెస్ట్ - son of MoS Home Ajay Mishra Teni
23:19 October 09
కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు అరెస్ట్
కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. లఖింపుర్ ఖేరీ ఘటనలో తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సుమారు 11 గంటల పాటు ప్రశ్నించారు. ఆశిష్‌మిశ్రా విచారణలో సహకరించలేదని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు ఆశిష్ సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో అతణ్ని అరెస్ట్ చేసినట్లు వివరించారు. త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.
ఈ నెల 3 వ తేదీన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతుండగా ఆశిష్ మిశ్రా కారు అక్కడున్న రైతులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు.