కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా(మోను)(Ashish mishra bjp) కారు రైతులపైనుంచి(Farmers protest news) దూసుకెళ్లినట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఉంది. ఆ సమయంలో మిశ్రా.. కారులోనే ఉన్నారని రైతులపై ఆశిష్ కాల్పులు జరిపినట్లు ఎఫ్ఐఆర్లో నమోదైంది. బహ్రెయిచ్ జిల్లాకు చెందిన జగ్జీత్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
" కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, అతని కుమారుడు ఆశిష్ మిశ్రా.. పథకం ప్రకారమే రైతులపై దాడి చేశారు. అజయ్ మిశ్రా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్లే.. రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రైతులు నల్లబ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మహారాజా అగ్రసేన్ ఇంటర్ కాలేజీ గ్రౌండ్‌కు వచ్చారు. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆశిష్ మిశ్రా.. 15-20 మందితో మూడు కార్లలో బన్బిర్పుర్లోని నిరసన ప్రదేశానికి వచ్చారు. ఆశిష్ మిశ్రా రైతులపై కాల్పులు జరిపారు. "
-- ఎఫ్ఐఆర్ ప్రకారం
అయితే.. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని(lakhimpur violence news), దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధమని.. లఖింపుర్ హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా వెల్లడించారు.