తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Lakhimpur violence: ఎన్నికల వేళ కేంద్ర మంత్రి తనయుడికి బెయిల్​ - లఖింపుర్​ ఖేరీ కేసు

Ashish Mishra Bail: ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటన ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్​ మిశ్రాకు బెయిల్​ వచ్చింది.

Ashish Mishra Bail
Ashish Mishra Bail

By

Published : Feb 10, 2022, 1:50 PM IST

Ashish Mishra Bail: లఖింపుర్​ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా తనయుడికి బెయిల్​ లభించింది. అలహాబాద్​ హైకోర్టు లఖ్​నవూ బెంచ్​.. అతడికి బెయిల్​ మంజూరు చేసింది. దీంతో ఆశిష్​ మిశ్రా విడుదల కానున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రి తనయుడు విడుదల కానుండటం.. ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ జరిగింది..

అక్టోబర్ 3న జరిగిన లఖింపుర్ ఖేరీ​ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న రైతుల పైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రా కారు దూసుకెళ్లింది. కారు ఢీకొని నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. అనంతరం చెలరేగిన హింసలో ఓ జర్నలిస్ట్ సహా నలుగురు చనిపోయారు. ఆశిష్​ మిశ్రా సహా పలువురిని సిట్ అరెస్టు చేసింది. నిందితులు ప్రస్తుతం లఖింపుర్ ఖేరీ జిల్లా కారాగారంలో ఉన్నారు.

ఈ ఘటనలో ఆశిష్​ మిశ్రాపై.. హత్య, హత్యాయత్నం ఆరోపణల కింద అభియోగాలు మోపింది సిట్​. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నట్లు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్​లో వెల్లడించింది.

ఇదీ చూడండి:కరోనా వేళ 'ఓట్ల' పండగ- ఉత్సాహంగా తరలిన ఓటర్లు

ABOUT THE AUTHOR

...view details