ASHA worker Gang Raped: ఆశా కార్యకర్తను నలుగురు యువకులు అపహరించి అనంతరం రేప్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఒడిశాలోని జగత్సింగ్పుర్ జిల్లా పారాదీప్ నగరంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైకిల్‌పై వెళ్తున్న ఓ ఆశా కార్యకర్తను నలుగురు యువకులు ఎర్ర కారులో వచ్చి నుయాబాజార్ ప్రాంతంలో అపహరించారు. అనంతరం నెహ్రూ బంగ్లా అనే ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పోలీస్ టీంతో పాటు ఒక సాంకేతిక టీం, డాగ్ స్క్వాడ్‌ను ఘటనా స్థలానికి దర్యాప్తు నిమిత్తం శనివారం ఉదయం పంపించామని చెప్పారు.
"ఎర్ర కారులో నలుగురు ఉన్నారు. నన్ను బలవంతంగా కారులోకి ఎక్కించారు. నెహ్రూ బంగ్లా వద్దకు తీసుకెళ్లి రేప్ చేశారు. రేప్ చేసే ముందు నన్ను దారుణంగా హింసించారు. నాకు న్యాయం జరగాలి."
-బాధితురాలు