స్థానిక కశ్మీరీ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితుల్ని చేసేందుకు ఉగ్రసంస్థలు కొత్త కుయుక్తులు పన్నుతున్నాయి. ఆన్లైన్ ద్వారా ఉగ్రసంస్థల్లో నియామకాలు చేపడుతున్నాయి. సామాజిక మాధ్యమాల సాయంతో శిక్షణను అందిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే దిశగా భారత సైన్యం గట్టి చర్యలు చేపట్టిన తరుణంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సైనికాధికారులు వెల్లడించారు.
నకిలీ వీడియోలు సృష్టించి..
అంతకుముందు ఉగ్రవాద సానుభూతి పరులు.. కశ్మీరీలతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకునే వారు. అయితే.. ప్రస్తుతం అలాంటి సానుభూతిపరులను సైన్యం అణచివేసింది. ఈ నేపథ్యంలో... భద్రతా బలగాలు దురాగతానికి పాల్పడ్డాయంటూ నకిలీ వీడియోలను సృష్టించి స్థానికుల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. తద్వారా యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. 2020లో 40 మందికి పైగా టెర్రరిస్టు సానుభూతిపరులను సైన్యం అరెస్టు చేసింది.
యూట్యూబ్‌లో ఉగ్రశిక్షణ..
గత నెలలో తవార్ వాఘే, అమీర్ అహ్మద్ మీర్ అనే ఇద్దరు ముష్కరులు.. 34 రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్మీ ముందు లొంగిపోయారు. ఆన్లైన్లో తాము ముష్కరులతో ఎలా చేతులు కలిపామో కీలక విషయాలను వెల్లడించారు.
పాకిస్థాన్‌కు చెందిన ఓ ఫేస్బుక్ ఖాతాదారుడితో ఆ ఇద్దరు ఉగ్రవాదులు సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత మహ్మాద్ అబ్బాస్ షేక్ అనే ఓ రిక్రూటర్ సాయంతో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ది రెసెస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రసంస్థలో చేరారు. యుట్యూబ్ లింకుల ఆధారంగా వారిద్దరికీ శిక్షణ అందింది. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లో ఒక్కసారి మాత్రమే.. వారు ముష్కరులను ప్రత్యక్షంగా కలిశారు.
ఎక్కువగా దక్షిణ కశ్మీర్‌లోనే..