Boat capsized :కాసేపట్లో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చాల్సిన పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా వరద నీటిలో పడిపోయారు. ఇద్దరు నీట మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే? జిల్లాలోని అథహత గ్రామం.. గత కొన్నిరోజులుగా పడుతున్న వర్షాల కారణంగా ముంపుకు గురైంది. ఆ గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఓ డీజల్ బోటును పంపారు. బోట్ బయలుదేరిన సమయంలో అందులో దాదాపు 20 మందికి పైగా ఉన్నారు. అయితే కొద్ది దూరం ప్రయాణించాక ఆ పడవ అకస్మాతుగా వేగం తగ్గడం ప్రారంభించి మునిగిపోయింది.