బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై(Aryan Khan arrest news) కీలక వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నవాబ్ మాలిక్. ఆర్యన్‌ను అక్రమంగా అరెస్టు (cruise ship rave party) చేశారని తెలిపారు. అసలు అరెస్టు చేసింది ఎన్సీబీ(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు కారని, భాజపా నాయకులని ఆరోపించారు. షారుక్‌ను (Aryan Khan arrest) టార్గెట్ చేసినట్లు నెలక్రితమే సమాచారం వచ్చిందని.. దీనిని బట్టి ఈ డ్రగ్స్ కేసు ఓ బూటకమని నవాబ్ పేర్కొన్నారు. ఎన్సీబీ, భాజపా మధ్య సంబంధమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
''క్రూయిజ్ పడవలో డ్రగ్ పార్టీ అనేది బూటకం. అది నకిలీ అరెస్టు(Aryan Khan arrest news) . తదుపరి లక్ష్యం షారుక్ ఖాన్ అని క్రైం రిపోర్టర్ల గ్రూపుల్లో నెల నుంచే సమాచారం చక్కర్లు కొట్టింది. ఆర్యన్ అరెస్టు వెనుక భాజపా కార్యకర్తల హస్తం ఉంది.''
- నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి
ఆర్యన్ ఖాన్‌తో(Aryan Khan Arrest) సెల్ఫీ తీసుకున్న ఓ వ్యక్తి ఫొటో వైరల్ కాగా.. అతడు తమ అధికారి కాదని ఎన్సీబీ స్పష్టం చేసింది. అయితే.. వారి వివరాలను వెల్లడించారు నవాబ్ మాలిక్. ఫొటోలోని కేపీ గోస్వామి అనే వ్యక్తి పుణెలో మోసాలకు పాల్పడ్డాడని, అతడి ఫేస్బుక్లో రహస్య గూఢచారి అని ఉన్నట్లు వెల్లడించారు. అర్బాజ్ మర్చెంట్‌ను అరెస్టు(Aryan Khan arrest news) చేసిన మనీష్ భానుషాలి భాజపా ఉపాధ్యక్షుడిగా ఫేస్బుక్లో ఉన్నట్లు తెలిపారు మాలిక్. ఇంకా.. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తో దిగిన ఫొటోలు కూడా ఫేస్బుక్లో ఉన్నట్లు వెల్లడించారు.
గోస్వామి, మనీష్ కలిసి ఉన్న ఫొటోలను కూడా నవాబ్ (Mumbai news today) విడుదల చేశారు. అయితే.. ప్రస్తుతం ఇరువురి ఫేస్బుక్ ఖాతాలు లాక్‌లో ఉన్నట్లు తెలిపారు. అసలు ఎన్సీబీకి, భాజపాకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత కావాలని డిమాండ్ చేశారు.
'నాకు భద్రత కావాలి'
దీనిపై స్పందించిన మనీష్.. తనకు భాజపాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై నవాబ్ మాలిక్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఈ అరెస్ట్‌లతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.
"డ్రగ్స్ పార్టీ జరగనుందని నాకు సమాచారం అందడం వల్లే నేను ఆ ప్రాంతానికి వెళ్లాను. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే రైడ్ జరిగిన సమయంలో ఎన్సీబీ అధికారులతో ఉన్నాను. ఓ బాధ్యతగల పౌరుడిగా మాత్రమే నేను ఎన్సీబీకి సమాచారం ఇచ్చాను. నవాబ్ మాలిక్‌పై పరువు నష్టం దావా వేస్తాను. ఆయన నా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టారు. నాకు భద్రత కల్పించమని అధికారులకు విజ్ఞప్తి చేస్తాను."
-మనీష్ భానుషాలీ, భాజపా కార్యకర్త