తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా ఎమ్మెల్యేపై రైతుల దాడి

పంజాబ్​లోని మాలౌట్​ నియోజకవర్గం రైతులు అబోహర్​ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యేపై దాడి చేశారు. అరుణ్​ నారాంగ్​ వాహనాన్ని అడ్డగించి.. వాహనంపై సిరా చల్లారు.

abohar mla arun narang, పంజాబ్​లో ఎమ్మెల్యేపై రైతుల దాడి
ఎమ్మెల్యేను బంధీ చేసిన రైతులు

By

Published : Mar 27, 2021, 9:50 PM IST

Updated : Mar 27, 2021, 11:07 PM IST

పంజాబ్‌లో భాజపాకి చెందిన అబోహర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అరుణ్​ నారాంగ్​పై రైతులు శనివారం దాడి చేశారు. ఎమ్మెల్యే శ్రీ ముక్త్​సర్​ సాహిబ్​ జిల్లాలోని మాలౌట్‌ నియోజకవర్గానికి చేరుకోగా‌ రైతులు ఆ వాహనాన్ని అడ్దగించారు. వాహనాన్ని ముందుకు కదలనివ్వకుండా చేసి.. వాహనంపైన, వారిపైనా సిరా చల్లారు. అనంతరం ఎమ్మెల్యేను ఓ షట్టర్​లోకి ఈడ్చుకెళ్లారు.

ఎమ్మెల్యేను బంధీ చేసిన రైతులు

రైతుల దాడి నుంచి ఎమ్మెల్యేను కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని పోలీసులు ఆరోపించారు. మాలౌట్​లో ఓ మీడియా సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో రైతులు ఈ దాడి జరిపినట్లు సమాచారం. ఈ ఘటనపై పార్టీతో చర్చించి ఫిర్యాదు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటానని అరుణ్​ నారాంగ్​ వెల్లడించారు.

ఈ ఘటనను రైతు సంఘాలు, ప్రతిపక్షాలు సహా అధికార కాంగ్రెస్ ఖండించాయి.

కిసాన్​ మోర్చా స్పందన

రైతుల దాడిని సంయుక్త కిసాన్​ మోర్చా ఖండించింది. ఈ ఘటనకు భాజపా, ఆ పార్టీ మిత్ర పక్షాలే కారణమని ఆరోపించింది. కేంద్రం రైతుల సమస్యలు తీర్చకుండా ఎన్నికల ప్రచారంలో లీనమైపోయిందని.. ఈ వైఖరి వల్ల స్థానిక నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని తెలిపింది.

ఈ ఘటనను ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్​ ఖండించారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

ప్రభుత్వమే కారణం..

ఎమ్మెల్యేపై దాడికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని ఆరోపించింది భాజపా. అమరీందర్​ సింగ్​ ప్రభుత్వం దీనికి బాధ్యత వహిస్తుందని పేర్కొంది.

ఖండించిన కిసాన్​ మోర్చా..

రైతుల దాడిని సంయుక్త కిసాన్​ మోర్చా ఖండించింది. ఈ ఘటనకు భాజపా, ఆ పార్టీ మిత్ర పక్షాలే కారణమని ఆరోపించింది. రైతుల పట్ల కేంద్రం చూపించే నిర్లక్ష్యం వల్ల స్థానిక నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని తెలిపింది.

ఇదీ చదవండి :'సిద్ధాంతాలపై ఆ పార్టీల్లో గందరగోళం'

Last Updated : Mar 27, 2021, 11:07 PM IST

ABOUT THE AUTHOR

...view details