Article 370: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ లోక్‌సభ స్థానం పరిధిలో క్రికెట్, కబడ్డీ పోటీలను నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. ఈ పోటీలకో విశేషం ఉంది.. వీటికి పెట్టే పేర్లలో 'ఆర్టికల్ 370' కలిసి ఉంటుందని పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఈమేరకు నిర్వహించే క్రికెట్ టోర్నమెంటుకు 'గాంధీనగర్ లోక్‌సభ ప్రీమియర్ లీగ్ 370' అని పేరు పెట్టారు.
Article 370: అమిత్ షా నియోజకవర్గంలో '370' క్రికెట్, కబడ్డీ పోటీలు - article 370 Kabaddi competition
Article 370: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియోజకవర్గంలో '370' క్రికెట్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 'ఆర్టికల్ 370' రద్దుకు సంబంధించిన ప్రతిపాదనను గాంధీనగర్ ఎంపీయే పార్లమెంటులో ప్రవేశపెట్టారని అందుకే ఇది కలిసొచ్చెలా పేర్లు పెడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

370 క్రికెట్ కబడ్డీ పోటీలు
పోటీలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని గుజరాత్ భాజపా ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సిన్హా వఘేలా తెలిపారు. "జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 'ఆర్టికల్ 370' రద్దుకు సంబంధించిన ప్రతిపాదనను గాంధీనగర్ ఎంపీయే పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అందువల్ల క్రీడా పోటీలకు ఇది కలిసివచ్చేలా పేర్లు పెడుతున్నాం" అని వఘేలా వివరించారు. డిసెంబరు 15 నుంచి ఈ పోటీలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.
ఇదీ చూడండి:శివసేన నాయకులను కలిసిన మమతా బెనర్జీ!