తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నలుగురిని పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకు అరెస్ట్​ - నలుగురిని పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకు అరెస్ట్​

అతడో ఉపాధ్యాయుడు. అప్పటికే ఒకరికి గురించి మరొకరిటి తెలియకుండా ఇద్దర్ని వివాహమాడాడు. అదీకాదని లాక్​డౌన్​ కాలంలో అదే తరహాలో మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. నాలుగో భార్యతో అతడి అసలు బాగోతం బయటపడింది. ఒడిశాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Art Teacher Marries Twice During Lockdown, Caught With Fourth Wife in Odisha
నలుగురిని పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకు అరెస్ట్​

By

Published : Feb 20, 2021, 11:47 AM IST

ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహమాడుతూ వరుస పెళ్లిళ్లతో నిత్య పెళ్లికొడుకుగా మారిన ఓ ఉపాధ్యాయుడి అసలు స్వరూపం బయటపడింది. లాక్​డౌన్​లో ఇద్దరు మహిళల్ని పెళ్లాడిన అతడిపై.. ఒడిశా కటక్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఏం జరిగిందంటే.?

వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన కృష్ణచంద్ర నాయక్​.. కటక్​ జిల్లా సలేపుర్​ ప్రాంతంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్నాడు. అతడికి తొలిసారిగా 2001లో ఓ మహిళతో వివాహమైంది. ఆ తర్వాత 2008లో రెండోసారి ఇంకొకరిని పెళ్లాడాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో వేరు వేరు కాపురాలు పెట్టాడట. ఇదిలా ఉండగా.. లాక్​డౌన్​ కాలంలో మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడు కృష్ణచంద్ర. ఈ సారి ఏకంగా స్వల్ప వ్యవధిలోనే ఇద్దరిని మనువాడాడు. దీంతో ఎట్టకేలకు అతడి బాగోతం బయటపడింది.

విషయం తెలిసిన మొదటి, మూడో భార్యలిద్దరూ పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ.. అతడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ట్విన్​ సిటీ కమిషనరేట్​ పోలీసులు.. నిందితుణ్ని అరెస్ట్​ చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా అతడిపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) సెక్షన్లు-493ఏ, 323, 294, 494, 500, 34 సహా.. వరకట్న నిషేధ చట్టం-4 కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఉరిశిక్షకు కాలపరీక్ష! - కేసుల పరిష్కరణలో జాప్యం

ABOUT THE AUTHOR

...view details