తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీశ్రీ రవిశంకర్ హెలికాప్టర్​ ఎమర్జెన్సీ ల్యాండింగ్​.. గ్రౌండ్​లో గంటపాటు వెయిటింగ్.. చివరకు! - తమిళనాడులో హెలికాప్టర్​ అత్యవసర ల్యాండింగ్​

ఆర్ట్ ఆఫ్​ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ తమిళనాడులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ప్రతికూల వాతావరణం కారణంగానే హెలికాప్టర్​ను ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేసినట్లు సిబ్బంది తెలిపారు.

art of living founder ravi shankar
art of living founder ravi shankar

By

Published : Jan 25, 2023, 1:19 PM IST

Updated : Jan 25, 2023, 3:20 PM IST

గత కొద్దిరోజులుగా వాతావరణ సమస్యలతో విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్నారు అధికారులు. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్​ ఆఫ్ లివింగ్​ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్​ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ను కూడా అదే విధంగా సిబ్బంది దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తమిళనాడు.. ఈరోడ్​ జిల్లాలో ఆయన ఉన్న హెలికాప్టర్​ను​ ఎమర్జెన్సీ ల్యాండ్​ చేశారు. హెలికాప్టర్​లో రవిశంకర్​తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

శ్రీశ్రీ రవిశంకర్ బుధవారం ఉదయం​ ఓ ప్రైవేట్​ హెలికాప్టర్​లో బెంగళూరు నుంచి తిరుపుర్ జిల్లాలోని కాంగేయానికి బయలుదేరి వెళ్లారు. వాతావారణం అనుకూలించకపోవడం వల్ల కడంబూరు సమీపంలోని ఒక్కియం ప్రభుత్వ పాఠశాల మైదానంలో హెలికాప్టర్​ను ల్యాండ్​ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సుమారు గంటపాటు స్థానికులతో రవిశంకర్​ ముచ్చటించారు. ప్రజలు కూడా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.

'బుధవారం ఉదయం శ్రీశ్రీ రవిశంకర్​ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ను​ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా స్కూల్​ గ్రౌండ్​లో ల్యాండ్​ చేశారు' అని కదంబూర్​ పోలీస్​ ఇన్​స్పెక్టర్​ వడివెల్​ కుమార్​ తెలిపారు. దాదాపు 50 నిమిషాల తర్వాత రవిశంకర్​ హెలికాప్టర్​ తిరిగి బయలుదేరినట్లు పోలీసులు వెల్లడించారు.

Last Updated : Jan 25, 2023, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details