బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(భాజపా) ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యంగాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అహంకారం, బలం, డబ్బు భాజపాకు అధికారాన్ని కట్టబెట్టలేకపోయాయన్నారు. వాటి కారణంగానే.. భాజపా ఓటమిపాలైందని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
ఇక.. బంగాల్ గడ్డపై హ్యాట్రిక్ విజయానికి తృణమూల్ కాంగ్రెస్ అన్నిరకాలుగా అర్హత కలిగి ఉందన్న సిబల్.. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించారు.