జమ్ముకశ్మీర్‌లో ఇటీవలే సైన్యం అరెస్టు చేసిన ఓ ఉగ్రవాది.. సంచలన రాజకీయ హత్యలకు కుట్రపన్నాడు. ఈ విషయాన్ని భారత సైన్యం ఆదివారం వెల్లడించింది. ఆ ఉగ్రవాదితో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
శుక్రవారం.. ఆర్మీ, పోలీసులు, పారా మిలటరీ దళాలు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో.. ఫిర్దోస్ అహ్మద్ నట్నూను దోడాలోని బెఖ్రియన్ గ్రామంలో అరెస్టు చేశారు. అతడి నుంచి మూడు చైనా పిస్టోల్స్‌తో పాటు ఐదు మ్యాగజైన్స్, 15 రౌండ్ల తూటాలు, ఓ సైలెన్సర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
"ఫిర్దోస్ అహ్మద్ నట్నూ అనే ఉగ్రవాది రాజకీయ హత్యలకు కుట్ర పన్నాడనే సమాచారం మాకు అందింది. ఫిర్దోస్, అతడి అనుచరులపై భద్రతా బలగాలు రెండు నెలలుగా నిఘా ఉంచాయి. ఆర్మీ, పోలీసులు, పారా మిలటరీ బలగాల సంయుక్త ఆపరేషన్‌లో అతడిని పట్టుకున్నాం."