ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ పోస్టర్లు వేశారనే ఆరోపణలతో కొంతమందిపై దిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్లపై ప్రశ్నలు అడుగుతున్నందున తమను కూడా అరెస్టు చేయాలని సవాలు విసిరింది. ఈ మేరకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ట్విట్టర్లో ప్రొఫైల్ చిత్రం మార్చారు.
"మోదీజీ మా పిల్లల టీకాలను విదేశాలకు ఎందుకు పంపించారు?" అనే ఫొటోను షేర్ చేసిన రాహుల్ గాంధీ.. తనను కూడా అరెస్టు చేయాలని సవాలు విసిరారు.
నన్ను అరెస్టు చేయండి..
"ప్రధాన మంత్రిని విమర్శిస్తూ పోస్టర్లు ప్రదర్శించడం ఇప్పుడు నేరమా? భారత్లో మోదీ పీనల్ కోడ్ అమల్లో ఉందా? కొవిడ్ మహమ్మారి విజృంభణ వల్ల దిల్లీ పోలీసులకు పనిలేకుండా పోయింది. నేను రేపు నా ఇంటి గోడ మీద పోస్టర్లు అంటిస్తాను. రండి నన్ను అరెస్టు చేయండి." అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శించారు.
ప్రశ్నలు వస్తూనే ఉంటాయి..