తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో 'పంద్రాగస్టు' సందడి- భద్రత కట్టుదిట్టం

దేశరాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవ సందడి మొదలైంది. వేడుకల కోసం ఎర్రకోటను అందంగా ముస్తాబు చేస్తున్నారు. అదే సమయంలో భద్రతా ఏర్పాట్లనూ చురుగ్గా చేపడుతున్నారు అధికారులు.

independence day arrangements
దిల్లీలో 'పంద్రాగష్టు' సందడి- భద్రత కట్టుదిట్టం

By

Published : Aug 13, 2021, 5:23 PM IST

75వ భారత స్వాతంత్ర్య దినోత్సవానికి దేశ రాజధాని దిల్లీ ముస్తాబవుతోంది. దేశంలో జరిగే వేడుకలకు ప్రతీకగా నిలిచే ప్రఖ్యాత ఎర్రకోట వద్ద ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబించేలా మూడు రంగుల పుష్పాలతో ఎర్రకోటను అలంకరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీక్షకులు భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా కుర్చీలు ఏర్పాటు చేశారు.

పెయింటింగ్ వేసిన కంటైనర్ల ముందు వరుసలో కూర్చున్న విద్యార్థులు
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం
పూలరేకులను వెదజల్లుతున్న ఆర్మీ హెలికాప్టర్

అదే సమయంలో, చారిత్రక కట్టడం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎర్రకోట పరిసరాల్లో భారీ ఎత్తున భద్రతా దళాల సిబ్బంది మోహరించారు. ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా అనుక్షణం పహారా కాస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై భద్రతా సిబ్బంది రిహార్సల్స్ చేశారు. త్రివిధ దళాలకు చెందిన సైనికులు కవాతు నిర్వహించారు.

నావికా దళ సిబ్బంది రిహార్సల్స్
కవాతు చేస్తున్న త్రివిధ దళాలు
ప్రధానికి భద్రత కల్పించే ఎస్​పీజీ దళం మాక్ డ్రిల్
దిల్లీ పోలీసుల మాక్ డ్రిల్

అటు దిల్లీ పోలీసులు సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు. నగర వ్యాప్తంగా పోలీసులను, కమాండోలను భారీగా మోహరించారు. నిఘా సంస్థలు, ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని సరిహద్దులో బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్లు దిల్లీ పోలీసుల ప్రతినిధి చిన్మోయ్ బిశ్వాల్ తెలిపారు.

ముస్తాబైన ఎర్రకోట ద్వారం; సెక్యూరిటీ సిబ్బంది పహారా
సిబ్బంది పహారా; చిత్రంలో 17వ శతాబ్దం నాటి ఫిరంగి; బాంబును గుర్తించే రోబో
రిహార్సల్స్​కు ముందు సేదతీరుతున్న నేవీ సిబ్బంది

ఇదీ చదవండి:భద్రతా బలగాలపై ముష్కరుల గ్రనేడ్​ దాడి

ABOUT THE AUTHOR

...view details