ఉత్తరాఖండ్లో సమాచార హక్కు చట్టం కింద విడుదల చేసిన అత్యాచార కేసుల వివరాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. 2019 నాటికి గత 19 ఏళ్లలోనే 4000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అంటే ప్రతి ఏటా సరాసరి 200 మంది మహిళలు రేప్ బాధితులుగా మారారు.
3956 అత్యాచార కేసులు, 19 యాసిడ్ దాడి కేసులు నమోదయ్యాయని ఆర్టీఐ చట్టం కింద హల్ద్వారాకు చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు హేమంత్ గోనియా ఈ వివరాలు వెల్లడించారు. రూ.4కోట్ల 81లక్షల 80వేలను అత్యాచార బాధితుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. యాసిడ్ దాడి బాధితులకు రూ. 17 లక్షల 90 వేలను ఖర్చుచేసింది.