పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సరిహద్దు వెంబడి ఒక్కో లాంచింగ్ ప్యాడ్ వద్ద 250 నుంచి 300 మంది వరకు ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని కశ్మీర్ బీఎస్‌ఎఫ్ ఐజీ రాజేశ్ మిశ్రా తెలిపారు. ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతా బలగాలు సమర్థవంతంగా అడ్డుకోగలిగాయన్నారు.
'ఏ క్షణంలోనైనా దేశంలోకి ఉగ్రవాదులు చొరబడొచ్చు' - india pakistan border situation latest news
సుమారు 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు పాక్‌లోని లాంచ్ ప్యాడ్స్ వద్ద భారత్‌లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని బీఎస్‌ఎఫ్ ఐజీ రాజేశ్ మిశ్రా తెలిపారు. వారు ఏ క్షణంలోనైనా దేశంలోకి చొరబడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
'సరిహద్దుల్లో 300 మంది పాక్ తీవ్రవాదులు'
ఇటీవల పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘిస్తూ దాడి చేసిన ఘటనలో అధిక సంఖ్య ప్రజలు గాయపడ్డారని, పెద్ద మెుత్తంలో వారి ఆస్తులు దెబ్బతిన్నాయని ఐజీ వెల్లడించారు. ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామని రాజేశ్ మిశ్రా తెలిపారు.