తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ జంతర్​మంతర్​ వద్ద రైతుల నిరసన - రైతు సంఘాలు

Around 200 farmers will be protesting at the Jantar Mantar in national capital on Thursday demanding the withdrawal of the controversial farms laws. However, they have not been allowed to march towards the Parliament House.

Farmers protest,
నేటి నుంచి జంతర్​మంతర్​ వద్ద రైతు నిరనసలు

By

Published : Jul 22, 2021, 8:34 AM IST

Updated : Jul 22, 2021, 1:16 PM IST

12:15 July 22

జంతర్​మంతర్​కు చేరిన రైతులు

పార్లమెంటు సమవేశాల నేపథ్యంలో రైతు సంఘాలు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద గురువారం నిరసన చేపట్టాయి. బీకేయూ నేత రాకేశ్​ టికాయిత్​ ఆధ్వర్యంలో రైతు నేతలు ఆందోళనలు నిర్వహించారు. సంయుక్త కిసాన్​ మోర్చా నుంచి 200 మంది.. కిసాన్​ సంఘర్ష్​ కమిటీ నుంచి ఆరుగురు రైతులు ధర్నాలో పాల్గొన్నారు. వీరంతా సింఘూ సరిహద్దు నుంచి ప్రత్యేక బస్సుల్లో రైతులు జంతర్​మంతర్​ చేరుకున్నారు. 

రైతు నిరసనలకు మద్దతుగా కాంగ్రెస్​, అకాలీదళ్​కు చెందిన ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని డిమాండ్​ చేశారు.

రైతు నేతల నిరసనలకు దిల్లీ పోలీసులు.. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు అనుమతించారు. గురువారం మొదలుకొని పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు రైతు నేతలు ప్రతిరోజు ఈ నిరసనలు కొనసాగిస్తారు.

12:01 July 22

శిరోమణి అకాలీ దళ్ నేతల నిరసన​ 

రైతులకు మద్దతుగా శిరోమణి అకాలీ దళ్​ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేపట్టారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​కు ప్లకార్డులు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.  

11:12 July 22

రైతులకు రాహుల్​ మద్దతు

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ సహా పంజాబ్​కు చెందిన ఆ పార్టీ​ ఎంపీలు రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.  

హింసకు పాల్పడటానికి తాము దుండగులం కాదన్నారు రైతు నేత రాకేశ్​ టికాయిత్. జనవరి 26న జరిగిన హింస నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.    

09:40 July 22

సింఘూ సరిహద్దు నుంచి బయలుదేరిన రైతులు

బయలుదేరిన రైతులు..

పార్లమెంటు వద్ద నిరసన తెలిపేందుకు సింఘూ సరిహద్దు నుంచి రైతులు బయలుదేరారు. ప్రత్యేక బస్సుల్లో 200 మంది రైతులు జంతర్​మంతర్​కు చేరుకోనున్నారు. 

08:35 July 22

జంతర్​మంతర్​కు బయలుదేరిన రాకేశ్​ టికాయిత్

రైతు సంఘం నేత రాకేశ్​ టికాయిత్​ మరో ఏడుగురు రైతులతో సింఘూ సరిహద్దు నుంచి బయలు దేరారు. 

జంతర్ మంతర్ వద్ద కిసాన్ పార్లమెంట్ నిర్వహిస్తామని టికాయిత్​ పేర్కొన్నారు. 

08:07 July 22

పార్లమెంటు వద్ద రైతు నిరసనలు

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నేడు రైతు సంఘాలు జంతర్​మంతర్​ వద్ద నిరసన తెలపనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో​ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.  

సమావేశాలు ముగిసేవరకు రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు రైతులు ధర్నా చేపడతారు. ఈ నిరసనల్లో ప్రతిరోజు 200 మంది రైతులు పాల్గొంటారు. 

Last Updated : Jul 22, 2021, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details