తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​కు ప్రధాని మోదీ- 10 వేల మంది సిబ్బందితో భద్రత - మోదీ పంజాబ్​ సందర్శన

Modi punjab visit: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్​లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రెండేళ్ల తర్వాత పంజాబ్‌లో కాలు మోపనున్న మోదీ.. సరిహద్దు జిల్లా పిరోజ్​పుర్​ను సందర్శిస్తారు. ఈనేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది సిబ్బంది సహా యాంటీ డ్రోన్​ బృందాన్ని కూడా మోహరించారు.

Modi to visit Punjab
Modi to visit Punjab

By

Published : Jan 5, 2022, 6:05 AM IST

Modi Punjab visit : మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్​లో ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బంది మోహరించినట్లు పంజాబ్​ డీజీపీ జీ నాగేశ్వరరావు తెలిపారు. సరిహద్దు జిల్లా ఫిరోజ్​పుర్​ను ప్రధాని సందర్శించనున్న తరుణంలో యాంటీ డ్రోన్​ బృందాన్ని కూడా మోహరించినట్లు వెల్లడించారు.

రెండేళ్ల తర్వాత పంజాబ్​ పర్యటనకు వెళ్లనున్న మోదీ.. రూ.42,750 కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో భాగం ఫిరోజ్​పుర్​లో దిల్లీ-అమృత్​సర్​-కత్రా ఎక్స్​ప్రెస్​వే, పీజీఎంఈఆర్​ శాటిలైట్​ సెంటర్​, అమృత్​సర్​-ఉనా నాలుగు లేన్ల రహదారి, ముకేరియన్-తల్వారా బ్రాడ్ గేజ్ రైలు మార్గం, కపుర్తలా హోషియార్‌పుర్‌లో రెండు కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టనున్నారు.

అయితే వివాదస్పదమైన మూడు సాగు చట్టాల రద్దు తర్వాత మోదీ.. పంజాబ్​ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రైతు సంఘాలు.. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి. కనీస మద్దతు ధరకు(ఎంఎస్​పీ) చట్టబద్ధత కల్పించాలని.. సాగుచట్టాలకు వ్యతిరేకం పోరాడిన రైతులపై నమోదు చేసిన పోలీసు కేసులు వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నాయి. ​

ఇదీ చూడండి:డ్రమ్స్​ వాయిస్తూ ఉల్లాసంగా గడిపిన మోదీ

ABOUT THE AUTHOR

...view details