తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అర్ణబ్ కోసం పాఠశాలను జైలుగా మార్పు! - అరెస్టయిన తర్వాత అర్నబ్ తొలి రాత్రి గడిపింది అక్కడే

ఆత్మహత్యకు ఉసిగొల్పారన్న కేసులో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిని కొవిడ్ సెంటర్​గా తీర్చిదిద్దిన పాఠశాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడకు తీసుకెళ్లినట్లు చెప్పారు. అర్ణబ్ బెయిల్ పిటిషన్​పై అలీబాగ్ కోర్టు గురువారం విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని బాంబే హైకోర్టులో అర్ణబ్ దాఖలు చేసిన పిటిషన్ సైతం గురువారమే విచాణకు రానుంది.

Arnab spends night at school designated jail's COVID-19 centre
అర్నబ్ బెయిల్ పిటిషన్​పై నేడే విచారణ

By

Published : Nov 5, 2020, 10:58 AM IST

Updated : Nov 5, 2020, 2:05 PM IST

ఆత్మహత్య చేసుకొనేలా ఓ ఇంటీరియర్ డిజైనర్​ను ఉసిగొల్పారన్న ఆరోపణలతో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిని.. కొవిడ్ సెంటర్​గా తీర్చిదిద్దిన పాఠశాలకు తరలించారు. ఈ నెల 18 వరకు కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో అలీబాగ్ కారాగార పరిధిలోని ఓ పాఠశాలలో ఉన్న కొవిడ్ సెంటర్​కు తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రంతా ఆయన అక్కడే ఉన్నట్లు చెప్పారు. వైద్య పరీక్షల నిమిత్తం అర్ణబ్​ను బుధవారం సాయంత్రం అలీబాగ్​లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

మరోవైపు, అర్ణబ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, వారిపై దాడి చేయడం, దూషణలు, బెదిరింపులకు పాల్పడినందుకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పత్రాలను చించేయడానికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.

బెయిల్ పిటిషన్లపై విచారణ

అర్ణబ్ బెయిల్ పిటిషన్​పై అలీబాగ్ కోర్టు గురువారం విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్​ను కొట్టివేయాలని అర్ణబ్ నవంబర్ 2న బాంబే హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్​ సైతం గురువారమే హైకోర్టు విచారణకు రానుంది.

రెండేళ్లనాటి కేసులో అర్ణబ్​తో పాటు అరెస్టయిన మరో ఇద్దరికి సైతం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కట్టడీ విధించింది. 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారన్న కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇదీ చదవండి-'ఆత్మహత్య' కేసులో అర్నబ్ గోస్వామి అరెస్టు

Last Updated : Nov 5, 2020, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details