Army Vehicle Accident Today :సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది సైనికులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతమైన లద్ధాఖ్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఓ జవాన్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Army Vehicle Accident Ladakh :పది మంది సైనికులతో కూడిన ఓ ఆర్మీ వాహనం సాయంత్రం 4.45 గంటల ప్రాతంలో అదుపుతప్పి లోయలో పడిందని అధికారులు తెలిపారు. లేహ్ సమీపంలో ఉన్న నియోమాలోని కెరీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు వారు వెల్లడించారు. ఎనిమిది సైనికులు ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మరో సైనికుడు చికిత్స పొందుతున్నాడని అధికారులు పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రాజ్‌నాథ్ సంతాపం..
ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. సైనికుల సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. గాయపడిన జవాన్ తొందరగా కోలుకోవాలని ఆకాక్షించారు.