జమ్ముకశ్మీర్ కుప్వారాలోని కరల్పురాలో ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న నిండు గర్భిణీకి సాయం చేసేందుకు సైనికులు ముందుకొచ్చారు. గర్భిణిని ఓ మంచంపై మోసుకెళ్లి 2 కిమీ దూరంలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. జననరి 5న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మంచులో గర్భిణీని మోసుకెళ్లిన జవాన్లు - గర్భిణీకి జవాన్ల సాయం
సరిహద్దుల్లో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు ఆపదొచ్చినా ముందుంటారు సైనికులు. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం. ఓ గర్భిణీకి నెలలు నిండడం వల్ల ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కానీ, మంచు బాగా కురవడం వల్ల వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు. అలాంటి పరిస్థితిలో జవాన్లు ఆమెను ఆస్పత్రికి మోసుకెళ్లారు.
గర్భిణీని మోసుకెళ్లిన జవాన్లు
మోకాళ్ల లోతు మంచులో గర్భిణీని సైనికులు తీసుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిమపాతంలోనూ మహిళ ప్రాణాన్ని కాపాడేందుకు సైనికులు చూపించిన ధైర్యసాహసాలను ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
- ఇదీ చూడండి:భక్తులకు శుభవార్త- 'శబరిమల రైలు'కు ఓకే