ఆర్మీ నియామకాల్లో అవకతవకల కేసును భారత సైన్యం తీవ్రంగా పరిగణిస్తోంది. లంచం ఇచ్చి ఆర్మీలో చేరిన వారిని.. అందుకు సహకరించిన వారిని సైన్యం నుంచి తొలగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే దీనిపై మరింత సమాచారం రావాల్సిఉంది.
'వారిని సైన్యం నుంచి పంపేస్తాం' - భారత్ సైన్యం
ఆర్మీ నియామకాల్లో అవకతవకలకు పాల్పడినవారిని ఉపేక్షించేది లేదని భారత్ సైన్యం స్పష్టం చేసింది. ఒక వేళ ఎవరన్నా అలా పాల్పడినట్లు రుజువైతే సైన్యం నుంచి పంపేయాలని నిర్ణయించింది.
'వారిని సైన్యం నుంచి నిర్థక్షిణ్యంగా పంపేస్తాం'
ఆర్మీ నియామకాల్లో అవకతవకల కేసులో దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. మొత్తం 23 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. వారిలో ఆరుగురు లెఫ్టినెంట్ కర్నల్ స్థాయి అధికారులు ఉండటం గమనార్హం. వారితో పాటు మేజర్, నాయిబ్ సుబేదార్, సిపాయ్లు సహా.. ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నట్లు తెలిపింది. సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ద్వారా ఈ నియామక ప్రక్రియ జరిగింది.
ఇదీ చదవండి:'ఆర్మీ నియామకాల కేసు సీబీఐకి బదిలీ'