తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్మీ వైమానిక విభాగంలో మహిళా పైలట్లు! - మహిళా పైలట్లపై ఎమ్ ఎమ్ నరవాణె

ఆర్మీ దళంలోని వైమానిక విభాగంలో మహిళలకు అర్హత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది భారత ఆర్మీ. జనవరి 15న ఆర్మీ దినోత్సవం సందర్భంగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

mm narawane
ఆర్మీ వైమానిక విభాగంలో మహిళలకు అర్హత

By

Published : Jan 12, 2021, 10:19 PM IST

ఆర్మీ దళంలోని వైమానిక విభాగంలో మహిళా పైలట్లను నియమించాలని భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత మహిళా అధికారులకు జులైలో శిక్షణ ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

జనవరి 15న ఆర్మీ దినోత్సవం పురస్కరించుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భారత సైన్యాధిపతి మనోజ్ ముకుంద్ నరవాణె.. వైమానిక విభాగంలో మహిళా అధికారుల నియామకంపై నెల క్రితమే ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

వైమానిక విభాగంలో మహిళలు ఇప్పటివరకు ట్రాఫిక్​ కంట్రోల్, గ్రౌండ్​ డ్యూటీస్​ మాత్రమే నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో ఆర్మీ ఓ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఇదీ చదవండి:రెండు టీకాల్లో మనకు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చా?

ABOUT THE AUTHOR

...view details