తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా రోగుల కోసం తాత్కాలిక సైనిక ఆస్పత్రుల ఏర్పాటు' - సైనిక వైద్యలతో ప్రత్యేక కొవిడ్​ కేర్​ సెంటర్లు

దేశంలో కరోనా విస్ఫోటనం కొనసాగుతున్న వేళ.. పౌరుల చికిత్స కోసం మిలటరీ ఆసుపత్రులను వినియోగిస్తున్నట్లు సైన్యాధిపతి ఎంఎం నరవాణే ప్రధానమంత్రి మోదీకి తెలిపారు. అలాగే తాత్కాలిక ఆసుపత్రులను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

PM Modi, Army Chief MM Naravane
ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్​ ఎంఎం నరవణే

By

Published : Apr 29, 2021, 3:48 PM IST

Updated : Apr 29, 2021, 5:21 PM IST

వైరస్‌ కట్టడికి సైన్యం చేస్తున్న చర్యలపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. సైన్యాధిపతి ఎంఎం నరవాణేతో భేటీ అయ్యారు. కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో సైన్యం చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు ప్రధాని కార్యలయం ఓ ప్రకటనలో తెలిపింది.

సైన్యంలోని వైద్య సిబ్బంది సేవలు వినియోగించుకునేలా.. వారిని రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచినట్లు నరవాణే ప్రధానికి తెలిపారు. అలాగే వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక ఆసుపత్రులను సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు మోదీకి వివరించారు.

వీలైనన్ని ప్రాంతాల్లో మిలటరీ ఆసుపత్రులను సాధారణ పౌరులకు చికిత్స అందించేందుకు వినియోగిస్తున్నట్లు నరవణే మోదీ వివరించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ఇదీ చదవండి:ఉచితం అంటే అర్థం ఇదే: రాహుల్

Last Updated : Apr 29, 2021, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details