India China border: అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల వెంట చైనా మౌలిక సదుపాయాలను మరింత పెంచుతోందని భారత సైన్యం తెలిపింది. బలగాల మరింత సులభంగా తరలించేందుకు వీలుగా రోడ్డు, రైలు, విమాన సేవల అనుసంధాన వ్యవస్థలను అభివృద్ధి చేస్తోందని భారత సైన్యం తూర్పు కమాండ్ అధిపతి లెఫ్ట్‌నెంట్ జనరల్ ఆర్.పి.కలీటా వెల్లడించారు. చైనా కదలికలను గమనిస్తున్న భారత సైన్యం కూడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
ఆగని చైనా కుట్రలు.. సైన్యం కోసం సరిహద్దుల్లో నిర్మాణాలు! - చైనా ఇండియా సరిహద్దు సదుపాయాలు
China infrastructure vs India: సరిహద్దులో చైనా కుయుక్తులు ఆపడం లేదు. భారత్‌తో ఉన్న సరిహద్దుల గుండా మౌలిక సదుపాయాలను మరింతగా పెంచుకుంటోంది. బలగాలను తరలించేందుకు ఉపయోగపడేలా.. రోడ్డు, రైలు, విమాన సేవల అనుసంధాన వ్యవస్థలను అభివృద్ధి చేస్తోందని భారత సైనికాధికారులు తెలిపారు. అయితే, భారత్ సైతం చైనాకు దీటుగా వసతుల నిర్మాణం చేపట్టిందని చెప్పారు.
పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ, లద్దాఖ్ సెక్టార్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఆరు డివిజన్ల సైనిక బలగాలను మోహరించింది. ఇంతవరకు దాయాది దేశం పాకిస్థాన్ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ప్రాధాన్యమిస్తూ వచ్చిన సైన్యం... ఇప్పుడు చైనాపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో దశలవారీగా బలగాల మోహరింపులో మార్పులు చేస్తోంది. జమ్ము కశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసే రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ డివిజన్‌ను తూర్పు లద్దాఖ్‌కు సైన్యం పంపించింది. రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన డివిజన్లను హరియాణ, ఉత్తరాఖండ్, అసోం తదితర రాష్ట్రాల సరిహద్దుల్లో సైనిక దళాలు మోహరించనున్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు.
ఇదీ చదవండి: