ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షా పత్రం లీకైన కేసులో ఓ సైనికాధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను సోమవారం.. పుణె న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పేపర్ లీక్‌కు సంబంధించి రెండు కేసులను నమోదు చేశారు.