తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోలో సైక్లింగ్​లో ఆర్మీ అధికారి గిన్నిస్​ రికార్డు - cycling Guinness world records

సోలో సైక్లింగ్​ను తక్కువ సమయంలో పూర్తిచేసి గిన్నిస్ రికార్డు సృష్టించారో ఆర్మీ అధికారి. కఠిన వాతావరణ పరిస్థితుల్లో సైక్లింగ్​ చేసి.. 'వేగవంతమైన సోలో సైక్లింగ్(పురుషులు)'లో సరికొత్త గిన్నిస్​ రికార్డును నెలకొల్పారు.

Army officer cycling from Leh to Manali to set Guinness record
ఆర్మీ అధికారి సైక్లింగ్

By

Published : Sep 26, 2021, 11:08 AM IST

Updated : Sep 26, 2021, 7:31 PM IST

గిన్నిస్​ రికార్డు(cycling Guinness world records) నెలకొల్పడమే లక్ష్యంగా చేపట్టిన సైకిల్ యాత్రను ఓ సైన్యాధికారి విజయవంతంగా పూర్తి చేశారు. జమ్ముకశ్మీర్​లోని లేహ్ నుంచి హిమాచల్​ప్రదేశ్​లోని మనాలి వరకు ఉన్న 472 కిమీల దూరాన్ని 34 గంటల 54 నిమిషాల్లో పూర్తి చేసి 'ఫాస్టెస్ట్ సోలో సైక్లింగ్​లో(పురుషులు)' భారత ఆర్మీ ఆధికారి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు.

సోలో సైక్లింగ్​లో గిన్నిస్ రికార్డు

వ్యూహాత్మక స్ట్రైకర్స్ విభాగానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ శ్రీపాద శ్రీరామ్ శనివారం తెల్లవారుజామున 4 గంటలకు లేహ్ నుంచి సైక్లింగ్​ ప్రారంభించారు. ఈ మిషన్​లో భాగంగా.. మొత్తం 472 కిలోమీటర్లు ప్రయాణించిన శ్రీరామ్​ దాదాపు 8,000 మీటర్ల ఎత్తులో సైక్లింగ్​ చేశారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించి.. ఆదివారం మధ్యాహ్నానికి హిమాచల్ ప్రదేశ్​లోని మనాలి చేరుకున్నారు.

సైక్లింగ్ హీరో కల్నల్ శ్రీపాద శ్రీరామ్

'స్వర్ణిమ్​ విజయ్ వర్ష్' వేడుకలు, 195వ గన్నర్స్ దినోత్సవం ఈ సాహస యాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్​ 'స్వర్ణిమ్​ విజయ్ వర్ష్' జరుపుకుంటోంది.

ఇదీ చూడండి:upsc result 2021: ఆ ఇంట్లో అక్కకు 1.. చెల్లికి 15వ ర్యాంక్​

Last Updated : Sep 26, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details