తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోలో సైక్లింగ్​లో ఆర్మీ అధికారి గిన్నిస్​ రికార్డులు

సోలో సైక్లింగ్​లో రెండు గిన్నిస్ రికార్డులను బద్దలు కొట్టారు ఆర్మీ అధికారి భరత్ పన్ను. ఇందులో 5942కి.మీల సుదీర్ఘమైన 'గోల్డెన్ క్వాడ్రిలేటరల్' రూట్ ఉండటం విశేషం.

Army officer breaks two Guinness World Records for fastest solo cycling
సోలో సైక్లింగ్​లో ఆర్మీ అధికారి 2 గిన్నిస్​ రికార్డులు

By

Published : Apr 8, 2021, 3:21 PM IST

భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ భరత్ పన్ను రెండు గిన్నిస్​ రికార్డులను సాధించారు. గతేడాది అక్టోబర్​లో సోలో సైక్లింగ్​ ఈవెంట్​లలో పాల్గొని ఈ ఘనత సొంతం చేసుకున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే ప్రపంచ రికార్డులకు సంబంధించిన ధ్రువపత్రాలను భరత్ అందుకున్నారు.

భరత్ పన్ను గిన్నిస్ రికార్డు

మొదటి రికార్డును 2020 అక్టోబర్​ 10న లేహ్​ నుంచి మనాలీ వరకు (472కి.మీలు) కేవలం 35 గంటల 25 నిమిషాల్లో సైకిల్ తొక్కి సాధించారు.

మనాలీ వద్ద భరత్

రెండోది.. 5942కి.మీల సుదీర్ఘమైన 'గోల్డెన్ క్వాడ్రిలేటరల్' రూట్. ఈ మార్గం దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్​కతాలను కలుపుతూ వెళ్తుంది. దానిని 14 రోజుల 23 గంటల 52 నిమిషాల్లో ఛేదించారు భరత్. ఈ ఈవెంట్​ దిల్లీలోని ఇండియా గేట్ వద్ద అక్టోబర్​ 16న ప్రారంభమై అక్టోబర్​ 30న అదే చోట ముగిసింది.

ఇదీ చూడండి:బంగ్లాదేశ్​ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్​

ABOUT THE AUTHOR

...view details