జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో రాజ్పుర్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య శుక్రవారం పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మిలిటెంట్లు హతమవగా ఓ జవాన్ వీరమరణం పొందారు. మిలిటెంట్లు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. మృతుల్లో లష్కరే తోయిబా జిల్లా కమాండర్, పాకిస్తాన్ ఉగ్రవాది ఉన్నారు.
ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం - కశ్మీర్ పుల్వామా ఎన్కౌంటర్
![ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం pulwama encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12329957-460-12329957-1625197797177.jpg)
09:53 July 02
పుల్వామా ఎన్కౌంటర్
హన్జిన్ గ్రామంలో ముష్కరులు ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని వారి కోసం గాలింపు చేపట్టారు. బలగాలను గుర్తించిన ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తం అయిన అధికారులు.. ముష్కరులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు.
09:03 July 02
పుల్వామాలో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం పొందారు.