Army Jawan Fires School Director: హోంవర్క్ చేయని కుమార్తెను కొట్టారన్న కోపంతో.. ఏకంగా పాఠశాల డైరెక్టర్‌పైనే కాల్పులు జరిపాడు ఆర్మీ జవాన్ పప్పు గుర్జార్. ఈ ఘటనలో అతడి భార్యకే బులెట్ తగిలింది. రాజస్థాన్ భరత్‌పుర్ జిల్లాలో సోమవారం జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది..
కన్వాడా గ్రామానికి చెందిన గుర్జార్ కుమార్తె ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతోంది. హోంవర్క్ చేయలేదని ఓ టీచర్ ఆమెను చెంపదెబ్బ కొట్టగా.. ఈ విషయం తన తండ్రికి చెప్పింది. కోపంతో రగిలిపోయిన జవాన్.. పాఠశాల డైరెక్టర్‌ను కలిసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అంతే.. గుర్జార్ తన జేబులో నుంచి గన్ తీసి అతనికి ఎక్కుపెట్టాడు. ఆపేందుకు మధ్యలోకి వచ్చిన గుర్జార్ భార్య భుజానికే.. ఆ బులెట్ దిగింది.