Jawan Killed In Marriage Firing: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో జరిగిన ఓ వివాహ వేడుకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి జరుగుతుండగా కొందరు అతిథులు ఆనందంతో కాల్పులు జరిపారు. అవి కాస్త మిస్‌ఫైర్ అయ్యాయి. దీంతో వివాహానికి హాజరైన ఓ ఆర్మీ జవాను మరణించాడు. మృతుడ్ని దయారామ్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు.
ఇదీ జరిగింది.. సోన్‌భద్రలో ఓ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఆ వివాహానికి రవాస్గంజ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన బాబులాల్ యాదవ్ కుమారుడు దయారామ్ యాదవ్ వచ్చాడు. జవానుగా విధులు నిర్వహిస్తున్న అతడు.. ఇటీవలే సెలవు మీద ఊరికి వచ్చాడు. అయితే ఆ పెళ్లిలో అకస్మాత్తుగా కొందరు కాల్పులు జరిపారు. అవి కాస్త మిస్‌ఫైర్ అయ్యి దయారామ్ను తాకాయి.