పాకిస్థాన్ గూఢచర్య సంస్థ 'ఐఎస్‌ఐ'కి రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణపై ఒక జవాన్‌ను అరెస్టు చేసినట్లు హరియాణా పోలీసులు తెలిపారు. నిందితుడి పేరు రోహిత్ కుమార్ అని.. అతడి కార్యకలాపాలపై అందిన రహస్య సమాచారం ఆధారంగా బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
పాక్ గూఢచారి సంస్థకు రహస్యాల చేరవేత- జవాన్ అరెస్టు - పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ
రహస్యాల గూఢచర్యం ఆరోపణలతో ఓ జవాన్‌ను హరియాణా పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకి రహస్య సమాచారాన్ని, ఫొటోలను చేరవేసినట్లు నిందితుడు విచారణలో చెప్పాడని తెలిపారు.
![పాక్ గూఢచారి సంస్థకు రహస్యాల చేరవేత- జవాన్ అరెస్టు Army jawan arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13360668-thumbnail-3x2-esionage.jpg)
పాక్ గూఢచారి సంస్థకు రహస్యాల చేరవేత- జవాన్ అరెస్టు
హరియాణా అంబాలా జిల్లాలోని కోద్వా ఖుర్ద్ గ్రామం అతడి స్వస్థలమని వివరించారు. మధ్యప్రదేశ్ భోపాల్‌లో సైనిక ఇంజినీరింగ్ రెజిమెంట్‌లో పని చేస్తున్నాడని పేర్కొన్నారు. సెలవుపై కొద్దిరోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడని తెలిపారు. పాకిస్థాన్ ఏజెంటుతో తాను సంబంధాలు సాగిస్తున్నట్లు అతడు విచారణలో అంగీకరించినట్లు ఎస్పీ హమీద్ అఖ్తర్ చెప్పారు. రహస్య సమాచారాన్ని, ఫొటోలను ఐఎస్‌ఐకి చేరవేసినట్లు చెప్పాడని వివరించారు.
ఇవీ చూడండి: