పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని అందచేస్తున్నాడనే ఆరోపణలతో ఓ జవానును పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌కు చెందిన కృనాల్ కుమార్ బారియాను అదుపులోకి తీసుకున్న అమృత్సర్ పోలీసులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
కృనాల్ ప్రస్తుతం ఫిరోజ్‌పుర్ కంటోన్మెంట్‌లోని ఐటీ సెల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. పాకిస్థాన్ ఐఎస్ఐకు చెందిన ఏజెంట్లతో కృనాల్ సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు వివరించారు. ఐటీ సెల్ నుంచి భారత ఆర్మీకి చెందిన అత్యంత సున్నితమైన, రహస్యమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్టు ఆరోపించారు.
వల వేసిన మహిళ..
2020లో ఫేస్బుక్ ద్వారా సిద్రాఖాన్ అనే పాకిస్థానీ మహిళా నిఘా అధికారితో కృనాల్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వాట్సాప్ మెసేజ్‌లకు దారితీసింది. అనేకమార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్నారు.