తూర్పు సిక్కింలో చైనా సరిహద్దుల(Indo-China border) వెంబడి భారత సైన్యం(Indian Army) బోఫోర్స్ శతఘ్నులతో యుద్ధ విన్యాసాలు(Army holds exercises) నిర్వహిస్తోంది. వారం రోజులుగా ఇవి సాగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వెంబడి భారీగా మౌలిక వసతులను చైనా నిర్మిస్తోంది. "సరిహద్దుల్లో ప్రస్తుతం ఉద్రిక్తతలు లేవు. పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి. అయితే ఉత్తర, తూర్పు సరిహద్దుల్లో స్థానికుల్లో భరోసా నింపడం కోసం ముందుజాగ్రత్త చర్యగానే విన్యాసాలు నిర్వహిస్తున్నాం" అని సైనికాధికారులు తెలిపారు.
ఉత్తర సిక్కింలోని లాచెన్, లాచుంగ్, థంగు, తూర్పు సరిహద్దుల్లోని షెరాథాగ్, కుపుప్ వద్ద భారత బలగాలు మోహరించాయి. స్వీడన్ తయారీ బోఫోర్స్ శతఘ్నులు 30 కిలోమీటర్ల ఆవలికి కూడా గుళ్లను ప్రయోగించగలవు. 1980లలో వీటిని భారత సైన్యంలోకి ప్రవేశపెట్టారు.