'ఆర్మీ' పేపర్ లీక్- దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు - భారత సైన్యం
15:26 February 28
'ఆర్మీ' పేపర్ లీక్- దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు
దేశవ్యాప్తంగా సాధారణ సిబ్బందిని నియమించేందుకు నిర్వహించే ఆర్మీ ప్రవేశ పరీక్ష రద్దయింది. ప్రశ్నాపత్రం లీకైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. పుణెలో స్థానిక పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో గతరాత్రి సైనిక నియామక పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు తేలిందని సైనికాధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహిస్తున్నామని తెలిపారు.
పారదర్శక చర్యల్లో భాగంగానే పరీక్షను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంలో అవినీతి చర్యలను భారత ఆర్మీ సహించదని స్పష్టం చేశారు.