భారత్-పాకిస్థాన్ సైన్యం మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం(Ceasefire) వల్ల మూడు నెలలుగా సరిహద్దుల్లో శాంతి నెలకొందని భారత సైన్యాధిపతి(Army Chief) ఎమ్ ఎమ్ నరవాణే అన్నారు. ఇరు దేశాల నిర్ణయం వల్ల జమ్ము కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(LOC) వెంబడి యథాతథస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. భారత్-పాక్ సత్సంబంధాలు మెరుగుపడేందుకు ఇది మొదటి అడుగు అవుతుందని పేర్కొన్నారు.
"నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ అనగానే.. భారత్ ఉగ్ర ఏరివేత చర్యను ఆపేస్తుందని కాదు. సరిహద్దుల వెంబడి ఉగ్ర సంస్థల క్యాంప్‌లను పాకిస్థాన్ ఆర్మీ ధ్వంసం చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదు. అది వారి అసమర్థత లేదా అయిష్టం అయింటుంది. కానీ, ఇది మాకు ఆలోచించాల్సిన విషయమే."