తూర్పు లద్దాఖ్‌లో గత ఆరు నెలలుగా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్లు సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె(general naravane news) తెలిపారు. వచ్చే వారంలో చైనాతో 13వ విడత సరిహద్దు చర్చలు జరిగే అవకాశముందన్న సైన్యాధిపతి(Army chief).. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామనే విశ్వాసం వ్యక్తంచేశారు. తూర్పులద్దాఖ్‌తో(army chief in ladakh) పాటు నార్తర్న్ ఫ్రంట్ వ్యాప్తంగా చైనా బలగాలను మోహరించిందన్న జనరల్ నరవణె.. ఇది కాస్త ఆందోళన కలిగించే పరిణామమని అభిప్రాయపడ్డారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా బదులిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
" గత ఆరునెలలుగా పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అక్టోబర్ రెండో వారంలో 13వ విడత చర్చలు జరుగుతాయని భావిస్తున్నాం. ఆ చర్చల్లో బలగాల ఉపసంహరణపై ఏకాభిప్రాయం కుదురుతుందనే నమ్మకం మాకుంది. ఒక్కొక్కటిగా... అన్ని ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుంటాం. విబేధాలను.. చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చనే అభిప్రాయం నాది. చర్చల ద్వారా ఫలితాలను సాధిస్తామనే నమ్మకం ఉంది. తూర్పు లద్దాఖ్ మాత్రమే కాదు నార్తర్న్ ఫ్రాంట్ వ్యాప్తంగా.. ఈస్టర్న్ కమాండ్ వరకూ చైనా గణనీయమైన స్థాయిలో బలగాలను మోహరించింది. సరిహద్దు ప్రాంతాలలో బలగాల మోహరింపు పెరగడం కచ్చితంగా ఆందోళన కల్గించే అంశమే. పరిస్థితులను
ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. మాకు వస్తున్న సమాచారం ఆధారంగా మౌలిక వసతుల దగ్గర నుంచి ఏదైనా ముప్పు ఎదురైతే దీటుగా బదులిచ్చేందుకు అవసరమైన బలగాల మోహరింపు వరకూ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఇబ్బంది ఎదురైనా దీటుగా
ఎదుర్కొనేందుకు పూర్తి సంసిద్ధంగా ఉన్నాం."