జమ్ముకశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ (Line Of Actual Control) వద్ద భద్రతపై ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే (Army Chief) సమీక్షించారు. శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని (ladakh news) సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన భద్రతా పరిస్థితులను పరిశీలించారని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న పరిస్థితులపై వివరించారు. ఈ పర్యటనలో సైనికులతో మాట్లాడిన సైన్యాధిపతి వారిని అభినందించినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
Army Chief: తూర్పు లద్దాఖ్‌లో పర్యటించిన సైన్యాధిపతి - నరవాణే లద్దాఖ్ పర్యటన
ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే (Army Chief) రెండు రోజుల పర్యటనలో భాగంగా లద్దాఖ్‌కు వెళ్లారు. తూర్పు లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు.
కశ్మీర్లో ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే
వాస్తవాధీన రేఖ (Line Of Actual Control) వెంబడి చైనా పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తూనే ఉందని విదేశాంగ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించి భారత సైనికులు తగిన రీతిలో బుద్ధి (India China Border Dispute) చెప్పాలని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జనరల్ నరవణే పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి:కశ్మీర్లో ముగ్గురు ఉగ్ర అనుచరులు అరెస్ట్