పేలిన గ్రనేడ్.. ఆర్మీ కెప్టెన్ సహా మరో ఆఫీసర్ దుర్మరణం - loc
09:01 July 18
పేలిన గ్రనేడ్.. ఆర్మీ కెప్టెన్ సహా మరో ఆఫీసర్ దుర్మరణం
Grenade Blast: జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గ్రనేడ్ పేలగా.. ఆర్మీ కెప్టెన్, జేసీఓ(జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్) దుర్మరణం చెందారు. నియంత్రణ రేఖ వెంబడి మేంఢర్ సెక్టార్ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
విధుల్లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్మీ పీఆర్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఘటన జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడ్డ.. కెప్టెన్, నాయబ్- సుబేదార్ను (జేసీఓ) హెలికాప్టర్లో ఉధంపుర్లోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేశారు.