చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా దాదాపు 17 మర పడవల కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఆర్డర్‌ను కూడా గోవాలోని ఒక నౌకల తయారీ కంపెనీకి ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకోసం పలు దఫాలుగా ఇరు దేశాల కోర్ కమాండర్లు భేటీ అయ్యారు. ఇక గోగ్రాపోస్ట్, హాట్ స్ప్రింగ్స్ వద్ద మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు.
పాంగాంగ్ సరస్సులోకి కొత్త పడవలు..!
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో దాదాపు 17 పడవల కొనుగోలుకు భారత్ రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఆర్డర్‌ను గోవాకు చెందిన ఆక్వారియుస్ షిప్‌యార్డ్ అనే నౌకల తయారీ కంపెనీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల తరలింపునకు ఈ పడవలను భారత్ వినియోగించనుంది.
గోవాకు చెందిన ఆక్వారియుస్ షిప్‌యార్డ్‌కు ఈ ఆర్డర్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ వేగంగా నడిచే బోట్లను తయారు చేస్తుంటుంది. భారత నావికదళ కమాండర్ అభిలాష్ టామీ ఫ్రాన్స్‌లోని గోల్డెన్ గ్లోబ్ రేసులో పాల్గొనేందుకు అవసరమైన బోట్‌ను ఈ కంపెనీ చేసింది. ఇటువంటి బోట్లను నావికాదళం కూడా వినియోగిస్తోంది. 35 అడుగుల పొడవు ఉండే ఈ బోటు 20-22 మందిని తరలించగలదు. గంటకు 20నాట్ల స్పీడు(37 కిలోమీటర్ల)తో ఇది ప్రయాణిస్తుంది. అవసరమైతే దీనికి తేలిక పాటి ఆయుధాలను కూడా అమర్చవచ్చు. దీనిని పూర్తిగా ఫైబర్ గ్లాస్‌తో తయారు చేస్తారు.
ఇదీ చూడండి: