తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంటిపై కూలిన ఆర్మీ యుద్ధ విమానం​.. ముగ్గురు మృతి.. పైలట్​ సేఫ్​! - విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి

భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్​ క్రాఫ్ట్​ మిగ్​-21.. రాజస్థాన్​లోని ఓ ఇంటిపై కూలిపోయింది. ప్రమాదం నుంచి పైలట్​ సురక్షితంగా బయటపడినప్పటికీ.. ముగ్గురు పౌరులు మృతి చెందారు.

army-aircraft-crash-mig21-aircraft-crashes-in-rajasthan
army-aircraft-crash-mig21-aircraft-crashes-in-rajasthan

By

Published : May 8, 2023, 10:58 AM IST

Updated : May 8, 2023, 12:40 PM IST

రాజస్థాన్​లోని ఓ ఇంటిపై ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​కు చెందిన ఎయిర్​ క్రాఫ్ట్​ మిగ్​-21 కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పైలట్ మాత్రం పారాష్యూట్ సాయంతో​ సురక్షితంగా బయటపడ్డాడు. అతడికి స్వల్ప గాయాలయ్యాయని ఎయిర్​ఫోర్స్​ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పైలట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

హనుమాన్‌ఘఢ్​ జిల్లాలోని బహ్లోల్‌నగర్‌ గ్రామంలో ఈ ఎయిర్​క్రాఫ్ట్​ కూలింది. సూరత్‌గఢ్‌ ఎయిర్‌బేస్‌ నుంచి ఈ యుద్ధ విమానం బయలుదేరిందని ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ అధికారులు తెలిపారు. రోజూవారీ శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన కొంతసేపటికే.. విమానం కూలిపోయినట్లు వారు వెల్లడించారు. విమానంలో అత్యవసర పరిస్థితి తలెత్తి అదుపు తప్పడాన్ని గుర్తించిన పైలట్​.. ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. అయితే అది వీలు కాకపోవడం వల్ల ప్రాణనష్టాన్ని తప్పించేందుకు.. యుద్ధవిమానాన్ని నిర్మానుష్య ప్రాంతంలో కూల్చేందుకు యత్నించినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై దర్యాప్తు జరిపేందుకు భారత వాయుసేన విచారణకు ఆదేశించింది. అనంతరం మృతుల కుటుంబాలకు ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.

ఇంటిపై కూలిన ఆర్మీ యుద్ధ విమానం

కూలిన ఆర్మీ హెలికాప్టర్​.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..
నాలుగు రోజుల క్రితం జమ్ము కశ్మీర్​లోనూ ఓ ఆర్మీ హెలికాప్టర్​ కూలిపోయింది. ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కిష్త్వార్ జిల్లాలో సైన్యానికి చెందిన ALH ధ్రువ్‌ చాపర్‌.. ప్రమాదానికి గురై మరువా నది ఒడ్డున నేలను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో పైలట్​, కో పైలట్, టెక్నీషియన్​ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. సమాచారం అందున్న అధికారులు వెంటనే సహాయక చేపట్టి.. క్షతగాత్రుల్ని ఉధంపుర్​లోని ఆస్పత్రికి తరలించారు. హెలికాప్టర్​లో సాంకేతిక సమస్య కారణంగానే హెలికాప్టర్ కూలిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్మీ హెలికాప్టర్​ కూలి ఇద్దరు మృతి..
అంతకుముందు భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్​ కుప్పకూలింది. మార్చి 16న అరుణాల్ ప్రదేశ్​లోని మండలా పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్​లో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మరణించిన పైలట్లను లెఫ్ట్​నెంట్​ కల్నల్​ వీవీబీ రెడ్డి, మేజర్​ ఎ. జయంత్​గా గుర్తించారు. అయితే లెఫ్టెనెంట్​ కల్నల్ వీవీబీ రెడ్డి.. తెలంగాణలోని యాదాద్రి జిల్లాకు చెందినవారుగా తెలిసింది. ఆయన భార్య కూడా ఆర్మీలోనే దంత వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్ననట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నామని చెప్పారు. మండలా పర్వత ప్రాంతంలో తూర్పు బంగ్లాజాప్ గ్రామ సమీపంలో విమాన శకలాలు లభించినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : May 8, 2023, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details