Rajya Sabha MP Mahendra Prasad passes away: జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) పార్టీ నేత, ఏడుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన పారిశ్రామిక వేత్త మహేంద్ర ప్రసాద్(81) సోమవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు జేడీయూ తెలిపింది.
బిహార్ నుంచి ఏడుసార్లు రాజ్యసభకు, ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు అరిస్టో ఫార్మాస్యూటికల్స్ ఫౌండర్ అయిన మహేంద్ర ప్రసాద్.. 1980లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం పాటు హస్తం పార్టీతోనే ఉన్నారు. ఆ తర్వాత జేడీయూలో చేరారు.