తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నేను నీ పని మనిషిని కాదు'.. విమాన ప్రయాణికుడితో ఎయిర్ హోస్టెస్ - ఎయిర్ లైన్స్​లో ప్రయాణికునికి సిబ్బందికి వాగ్వాదం

ఇండిగో ఎయిర్​లైన్స్​లో ఓ ప్రయాణికుడికి, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Argument between passenger and lady staff in Indigo Airlines
ఇండిగో విమానయాన సంస్థలో ప్రయాణికునికి, సిబ్బందికి మధ్య వాగ్వాదం

By

Published : Dec 21, 2022, 5:16 PM IST

ఇండిగో ఎయిర్​లైన్స్​లో ప్రయాణికుడికి, సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లిప్‌ను చిత్రీకరించి ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి అందించిన సమాచారం ప్రకారం.. ఆహారం విషయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇస్తాంబుల్-దిల్లీ విమానంలో ఈ ఘటన జరిగింది. ఎయిర్ హోస్టెస్​కు, ప్రయాణికునికి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు ఆ వీడియోలో ఉంది. ఎయిర్ హోస్టెస్ ఆ వ్యక్తితో మాట్లాడుతూ.. "నువ్వు వేలు చూపిస్తూ.. అరుస్తున్నావు. నా సిబ్బంది నీ వల్ల ఏడుస్తున్నారు. దయచేసి అర్ధం చేసుకోండి. మీ బోర్డింగ్ పాస్​లో ఏం ఉందో దాని ప్రకారమే మేము మీకు ఆహారాన్ని సెర్వ్ చేస్తాం" అని ఆమె చెప్పింది. కానీ ఆమె పూర్తిగా మాట్లాడకముందే ఆ వ్యక్తి.. ఎందుకు నాపై అరుస్తున్నావ్ అని అడిగాడు. దీంతో నీవు ముందు మాపై అరిచావు, అందుకే నేను గట్టిగా మాట్లాడాను అని ఆ ఎయిర్ హోస్టెస్ సమాధానమిచ్చారు.

ఆమె సహోద్యోగి జోక్యం చేసుకుని వారిద్దరినీ శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కానీ ప్రయాణికుడు, ఎయిర్‌హోస్టెస్ మాత్రం వాగ్వాదాన్ని ఆపలేదు. "నన్ను క్షమించండి, కానీ మీరు సిబ్బందితో అలా మాట్లాడకూడదు. నేను మీ మాటలను శాంతియుతంగా వింటున్నాను, మీరు సిబ్బందిని కూడా గౌరవించాలి" అని ఎయిర్ హోస్టెస్ ​సహోద్యోగి.. ప్రయాణికుడికి చెప్పడం ఆ వీడియోలో కన్పిస్తుంది. 'నేను సిబ్బందిని ఎక్కడ అగౌరవపరిచాను?' అని ఆ వ్యక్తి అంటుంటే.. దానికి ఎయిర్ హోస్టెస్ మళ్లీ వేలు చూపించారు.

దీంతో నోరు మూసుకో అని ఆ వ్యక్తి అన్నాడు. దీనికి ఎయిర్ హోస్టెస్ బదులిస్తూ.."నువ్వే నోరు మూసుకో. నేను కంపెనీకి ఉద్యోగిని, నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడే అవకాశం లేదు" అని ఆమె బదులిచ్చారు. దీనికి ఆ వ్యక్తి.. ఎయిర్‌హోస్టెస్​తో నువ్వు నా సర్వెంట్​వి అని అంటాడు. దీనికి ఆమె బదులిస్తూ.. నేను ఇక్కడ ఉద్యోగిని, నీకు సర్వెంట్​ని కాను అని స్పష్టం చేశారు. ఎయిర్ హోస్టెస్ సహోద్యోగి ఆమెను వెనక్కి తీసుకుని వెళ్లడం వల్ల ఈ గొడవ ముగుస్తుంది.
"ఈ ఎయిర్ హోస్టెస్‌లు ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ.. చాలా కష్టపడి పనిచేస్తారు. వారు హృదయపూర్వకంగా సహాయం చేస్తారు. ఆ ఎయిర్ హోస్టెస్ అరుస్తున్నారంటే అక్కడ ఏదో పెద్ద వ్యవహారమే జరిగి ఉంటుందని అర్థం" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

ఈ వ్యవహారంపై ఇండిగో ఎయిర్​లైన్స్​ స్పందించింది. "డిసెంబర్​ 16న జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. ఆ ప్రయాణికుడు సాండ్​విచ్​ కావాలని అడిగారు. అయితే.. ఫ్లైట్​లో ఉందో లేదో చూసి చెబుతామని మా సిబ్బంది బదులిచ్చారు. కానీ ఆ వ్యక్తి ఎయిర్​హోస్టెస్​పై అరవడం ప్రారంభించారు. అందుకే ఆమె ఏడ్చింది. ఈ వ్యహారంపై దర్యాప్తు చేస్తున్నాం. ప్రయాణికులు సౌకర్యవంతంగా ఉండడమే మా ప్రాధాన్యం." అని ఇండిగో ఎయిర్​లైన్స్​ ఓ ప్రకటనలో పేర్కొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details