Are You Using A Credit Card...But Know These 5 Common Mistakes: క్రెడిట్ కార్డ్ గురించి తెలియని వారుండరంటే అతియోశక్తి కాదు. ఈరోజుల్లో చిరు ఉద్యోగుల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకూ చాలా మంది క్రిడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. ఈ కార్డ్ ద్వారా ప్రయాణ బుకింగ్, షాపింగ్, సినిమా టికెట్లు, వాహనాల బుకింగ్, ఈ-కామర్స్ సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలు, క్యాష్ బ్యాక్‌ల వంటి మెరుగైన సౌకర్యాలను పొందుతున్నారు. అయితే, చాలామంది వినియోగదారులు క్రిడెట్ కార్డు వాడకం విషయంలో తరచుగా 5 రకాల తప్పులు చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఆ తప్పుల వల్ల ఇతర ప్రయోజనాలను పొందలేకపోతున్నారని తెలిపారు. మరీ ఆ 5 తప్పులు ఏమిటి..?, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి..?, క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు అత్యధికంగా ఎంతవరకూ ఉంటాయి..? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. క్రెడిట్ కార్డ్ బిల్లులు ఆలస్యంగా చెల్లించటం..
Late payment of credit card bills:క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించే వినియోగదారులు చేస్తున్న తప్పుల్లో మొదటిది.. ప్రతి నెలా చెల్లించాల్సిన చెల్లింపులు ఆలస్యంగా చెల్లించటం. దీని కారణంగా వినియోగదారులపై భారీ రుణభారం పడుతుంది. ఎందుకంటే చెల్లింపు కోల్పోయినప్పుడు బ్యాలెన్స్‌లపై వడ్డీ ఛార్జీలు విధించబడతాయి. సుమారుగా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు నెలకు 2శాతం నుండి 3.5శాతంపైనే ఉంటుంది. దీని కారణంగా వడ్డీ రోజువారీగా విధించబడి వినియోగదారుడు అప్పులపాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ బిల్లులను ప్రతి నెలా సమయానికి చెల్లిస్తే వినియోగదారునికి రుణభారం తగ్గుతుంది. క్రెడిట్ కార్డ్ స్కోర్ కూడా పెరుగుతుంది.
Bhadrachalam: 'తాతా ఏటీఎంలో నుంచి నేను డబ్బు తీసిస్తా ఆగు'.. అంటూ
2. పూర్తిస్థాయి బకాయి ఉన్న సగం బకాయి మాత్రమే చెల్లించడం
Paying only half of the full amount due:క్రెడిట్ కార్డులో ఉన్న పూర్తిస్థాయి బకాయిలను చెల్లించకుండా చాలా మంది వినియోగదారులు కనిష్టంగా (సగం సగం) చెల్లిస్తుంటారు. ఇది మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కనిష్ట చెల్లింపులు చేసేవారికి చెల్లించని బ్యాలెన్స్‌పై భారీగా వడ్డీ విధించబడుతుంది. అంతేకాదు, కనీస మొత్తాన్ని చెల్లించే సమయంలో మిగిలిన బ్యాలెన్స్‌పై కూడా వడ్డీ ఛార్జీలు విధించబడతాయి. కాబట్టి క్రెడిట్ కార్డ్ బకాయిలను పూర్తిగా, సమయానికి చెల్లిస్తే ఎల్లప్పుడూ మంచిది.
3. నగదుపై అడ్వాన్స్‌లు తీసుకోవడం, అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం
Taking advances on cash, spending on unnecessary things: చాలామంది క్రిడెట్ కార్డ్ వినియోగదారులు నగదుపై అడ్వాన్స్ తీసుకుని.. అనవసరం లేని వాటిపై ఖర్చు చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు నిపుణులు. వినియోగదారుడు ఈ మార్గం ద్వారా సులభంగా నగదు పొందవచ్చమో కానీ.. ఇది అత్యంత ఖరీదైనది. నగదు ఉపసంహరించుకున్న వెంటనే వడ్డీ పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే, క్రెడిట్ కార్డ్‌పై, నగదు అడ్వాన్స్‌పై అదనపు రుసుము విధించబడుతుంది. కొన్ని బ్యాంకులు నగదు విత్‌డ్రా చేసినప్పుడు కొంత శాతం వడ్డీని వసూలు చేస్తాయని గుర్తు పెట్టుకోవాలి. అలాగే, వన్-టైమ్ క్యాష్ అడ్వాన్స్ రుసుమును కూడా చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు నగదు అడ్వాన్స్ విషయంలో నియంత్రణ పాటించాలి.