ఇంగ్లాండ్ క్రికెటర్లు జానీ బెయిర్‌స్టో, డొమినిక్ సిబ్లేలపై స్లెడ్జింగ్‌కు దిగాడు శ్రీలంక వికెట్‌కీపర్ నిరోషన్ డిక్వెల్లా. రెండో టెస్టులో ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడు నిర్విరామంగా స్లెడ్జ్ చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో 'డబ్బుల కోసమే నువ్వు బ్యాటింగ్, క్రికెట్ ఆడతావు' అంటూ బెయిర్‌స్టోను ఎద్దేవా చేశాడు డిక్వెల్లా.
వచ్చే నెల నుంచి భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటించనుంది. తొలి రెండు టెస్టులకు బెయిర్‌స్టోకు విశ్రాంతినిచ్చారు. మరోవైపు వచ్చే ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని అట్టిపెట్టుకుంది. దీంతో 'భారత్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. కానీ ఐపీఎల్ ఆడతాడు. డబ్బుల కోసమే ఇతడు ఆడతాడు' అని బెయిర్‌స్టోపై వ్యాఖ్యలు చేశాడు లంక ఆటగాడు.
ఈ మాటల ప్రభావం బెయిర్‌స్టోపై పడినట్లుగానే ఉంది. ఆ వెంటనే స్లిప్‌లో ఉన్న క్రికెటర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.