తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇసుక కూలీ వద్ద అరుదైన దుర్గాదేవి విగ్రహం - బుద్గాంలో అరుదైన దుర్గాదేవీ విగ్రహం

నదిలో ఇసుక తోడే ఓ కూలీ వద్ద నుంచి అరుదైన దుర్గాదేవి(Goddess Durga) విగ్రహాన్ని జమ్ముకశ్మీర్​ పోలీసులు(Jammu and Kashmir Police) స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహం దాదాపు 1,200 ఏళ్ల క్రితం నాటిదని అధికారులు తెలిపారు.

1200 yr old godess durga sculpture
దుర్గాదేవీ విగ్రహం

By

Published : Sep 1, 2021, 10:57 AM IST

1,200 ఏళ్ల క్రితం నాటి అరుదైన దుర్గాదేవి విగ్రహాన్ని(Goddess Durga) కశ్మీర్ బుద్గాం జిల్లాలో పోలీసులు(Jammu and Kashmir Police) స్వాధీనం చేసుకున్నారు. జీలం నదిలో ఇసుక తోడే ఓ కూలీ వద్ద దీన్ని వారు గుర్తించారు. పక్కా సమాచారంతో.. ఖాన్​సాహిబ్​ ప్రాంతంలోని ఆ వ్యక్తి వద్దకు చేరుకుని, సోదాలు చేసి ఈ విగ్రహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

1200 ఏళ్ల నాటి విగ్రహం
విగ్రహాన్ని పరిశీలిస్తున్న అధికారులు
దుర్గాదేవి విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారికి అప్పగిస్తున్న జమ్మకశ్మీర్​ పోలీసులు

12 సెంటిమీటర్ల పొడవు 8 సెంటిమీటర్ల వెడల్పుతో.. సింహంపై దుర్గాదేవి ఆసీనులై ఉన్నట్లుగా ఈ విగ్రహం చెక్కి ఉంది. ఆగస్టు 31న ఇసుక తరలిస్తుండగా తనకు ఈ విగ్రహం దొరకిందని సదరు కూలీ పేర్కొన్నాడు. ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్​ ముస్తాక్​ అహ్మద్​ బేగ్​కు బుద్గాం ఎస్ఎస్​పీ తాహీర్ సలీం ఖాన్​ అప్పగించారు. ఇది దాదాపు క్రీస్తు శకం 7-8వ శతాబ్దం కాలం నాటికి చెందిందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details